should I not serve
2 సమూయేలు 15:34

నీవు పట్టణమునకు తిరిగి పోయి రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.

1 సమూయేలు 28:2

దావీదు -నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందు వనెను . అందుకు ఆకీషు -ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతు ననెను .

1 సమూయేలు 29:8

దావీదు -నేనేమి చేసితిని ? నా యేలినవాడవగు రాజా , నీ శత్రువులతో యుద్ధముచేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటి వరకు నీ దాసుడనై నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను .

కీర్తనల గ్రంథము 55:21

వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

గలతీయులకు 2:13

తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను.