ఆమెను బలవంతముచేసి
2 సమూయేలు 12:11

నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.

ద్వితీయోపదేశకాండమ 22:25-27
25

ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను.

26

ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగువానిమీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.

27

అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.

న్యాయాధిపతులు 20:5

గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి

ఎస్తేరు 7:8

నగరువనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగిరాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.