వారు మా ప్రభువు ఇట్లు మాట లాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.
ఆదికాండము 34:25-31
25

మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు, తమ కత్తులు చేతపట్టుకొని యెవరికి తెలియకుండ ఆ ఊరిమీద పడి ప్రతి పురుషుని చంపిరి.

26

వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటనుండి దీనాను తీసికొనివెళ్లిపోయిరి

27

తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని

28

వారి గొఱ్ఱలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి

29

వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.

30

అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు ;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను

31

అందుకు వారువేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.

ఆదికాండము 35:22

ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

ఆదికాండము 37:18-32
18

అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి.

19

వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు;

20

వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.

21

రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను.

22

ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను.

23

యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొనియుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి,

24

అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు.

25

వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొనిపోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.

26

అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము?

27

ఈ ఇష్మాయేలీయులకు వానిని అమి్మవేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్తసంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.

28

మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమి్మవేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.

29

రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని

30

తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా

31

వారు యోసేపు అంగీని తీసికొని, ఒకమేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి

32

ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి

ఆదికాండము 38:16-18
16

ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.

17

అందుకతడు నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.

18

అతడు నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి

యెహొషువ 22:22-29
22

దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి.

23

యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితివిు.

24

ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపువారు మా సంతానపువారితో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము?

25

రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతానపువారు మా సంతానపువారిని యెహోవా విషయములో భయభక్తులులేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితివిు.

26

కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకొంటిమి; అది దహనబలుల నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు.

27

మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకు యెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును.

28

అందుకు మేముఇకమీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పినయెడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలి నర్పించుటకు కాదు బలి నర్పించుటకు కాదుగాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి.

29

ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయినయెడల నేమి యెహోవామీద ద్రోహము చేసినయెడల నేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక.

2 సమూయేలు 20:20

యోవాబు నిర్మూలము చేయను, లయ పరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.

2 రాజులు 8:13

అందుకు హజాయేలు కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా , ఎలీషా నీవు సిరియా మీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచి యున్నాడనెను .

సామెతలు 22:1

గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.

ప్రసంగి 7:1

సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు.

హెబ్రీయులకు 13:18

మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.