క్రీ.శ. 2135. క్రీ.పూ. 1869. బొస్రా
యెషయా 34:6
యెహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వుచేత కప్పబడును గొఱ్ఱపిల్లలయొక్కయు మేకలయొక్కయు రక్తము చేతను పొట్లేళ్ల మూత్రగ్రంథులమీది క్రొవ్వుచేతను కప్ప బడును ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును ఎదోము దేశములో ఆయన మహా సంహారము చేయును.
యెషయా 63:1
రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోమునుండి వచ్చు చున్న యితడెవడు? శోభితవస్త్రము ధరించినవాడై గంభీరముగా నడచుచు బొస్రానుండి బలాతిశయముతో వచ్చుచున్న యిత డెవడు? నీతినిబట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే.
యిర్మీయా 49:13

బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

యిర్మీయా 49:22

శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలెనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

ఆమోసు 1:12

తేమానుమీద అగ్ని వేసెదను , అది బొస్రాయొక్క నగరులను దహించివేయును .

మీకా 2:12

యాకోబు సంతతీ, తప్పక నేను మిమ్మునందరిని పోగుచేయుదును , ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును . బొస్రా గొఱ్ఱలు కూడునట్లు వారిని సమకూర్చుదును , తమ మేతస్థలములలో వారిని పోగుచేతును , గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు.