Why have
1 సమూయేలు 22:8

మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారుని తో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియజేయ లేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింత లేదే.

కీర్తనల గ్రంథము 119:69

గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణహృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును.

ఆమోసు 7:10
అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాము నకు వర్తమానము పంపి -ఇశ్రాయే లీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు;
లూకా 23:2-5
2

–ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.

3

పిలాతు– నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన–నీ వన్నట్టే అని అతనితో చెప్పెను.

4

పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను–ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడ లేదనెను.

5

అయితే వారు–ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.