సేవకులు
కీర్తనల గ్రంథము 56:1

దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగవలెననియున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు.

రాజు
1 సమూయేలు 16:1

అంతట యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను -ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.

1 సమూయేలు 18:7

ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు -సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతము చేసిరనిరి.

1 సమూయేలు 18:8

ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని-వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అనుకొనెను

1 సమూయేలు 29:5

సౌలు వేలకొలదిగాను దావీదు పదివేలకొలదిగాను హతముచేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి.