పేరులు
1 సమూయేలు 17:28

అతడు వారి తో మాటలాడునది అతని పెద్ద న్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో-నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నే నెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.

1 సమూయేలు 16:6-9
6

వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి -నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచి యున్నాడని అనుకొనెను

7

అయితే యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.

8

యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు-యెహోవా ఇతని కోరుకొన లేద నెను.

9

అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు-యెహోవా ఇతనిని కోరుకొన లే దనెను.

1దినవృత్తాంతములు 2:13

యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

షమ్మా
2 సమూయేలు 13:3

అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు

2 సమూయేలు 13:32

దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి –రాజకుమారులైన ¸యవనులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాటనుండి అబ్షాలోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చయించుకొనవచ్చును.

2 సమూయేలు 21:21

అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.