
సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;
మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.
నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలెనున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.