తన్నుతానే హెచ్చించుకొనుచు
యెషయా 14:13

నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతముమీద కూర్చుందును

యెహెజ్కేలు 28:2

నర పుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలు నకంటె జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియు లేదు.

యెహెజ్కేలు 28:6

కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్న వాడా, ఆలకించుము;

యెహెజ్కేలు 28:9

నేను దేవుడనని నిన్ను చంపువాని యెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.

దానియేలు 7:8

నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.

దానియేలు 7:25

ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థ కాలము అతని వశమున నుంచబడుదురు.

దానియేలు 8:9-11
9

ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణము గాను తూర్పు గాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.

10

ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను

11

ఆ సైన్యముయొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.

దానియేలు 11:36

ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.

ప్రకటన 13:6

గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

called
1 కొరింథీయులకు 8:5

దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

కూర్చుండును
దానియేలు 8:12-14
12

అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపు చేయుటకై యొక సేన అతనికియ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టాను సారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను.

13

అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని; అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరియొక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలినిగూర్చియు, అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన యీ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్లు పట్టుననియు, ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్లక్రింద త్రొక్కబడుట ఎన్నాళ్లు జరుగునో యనియు మాటలాడుకొనిరి.

14

అందుకతడురెండువేల మూడు వందల దినములమట్టుకే యని నాతో చెప్పెను. అప్పుడు ఆలయపవిత్రతనుగూర్చిన తీర్పు తీర్చబడును.

దానియేలు 11:45

కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధా నందములుగల పర్వతమునకును మధ్య వేయును; అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయముచేయు వాడెవడును లేకపోవును.

ప్రకటన 13:6

గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోకనివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను.

ప్రకటన 13:7

మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.