was learned
1 రాజులు 4:29

దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను

2 దినవృత్తాంతములు 9:22

రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.

యెషయా 19:11

ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?

దానియేలు 1:4

తత్వ జ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువ దగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

దానియేలు 1:17-20
17

ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.

18

నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.

19

రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవరును కనబడ లేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.

20

రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్య మందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరి కంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.

and was
లూకా 24:19

ఆయన– అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు–నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.