
కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.
కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి , నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను .
కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలములలో ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదను . దాని మాన సంరక్షణార్థమైన నా గొఱ్ఱబొచ్చును జనుపనారయు దానికి దొరకకుండ నేను ఉంచుకొందును ;
దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును , నా చేతిలో నుండి దాని విడిపించు వాడొకడును లేకపోవును.
దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామకకాలములను మాన్పింతును .
ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్షచెట్లను గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియు చెప్పినది గదా. నేను వాటిని లయపరతును , అడవి జంతువులు వాటిని భక్షించునట్లు వాటిని అడవివలె చేతును .
అది నన్ను మరచిపోయి నగలుపెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపమువేసి యుండుటను బట్టియు దాని విటకాండ్రను వెంటాడియుండుటనుబట్టియు నేను దానిని శిక్షింతును ; ఇది యెహోవా వాక్కు .
పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును ;
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా -ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును . పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.
మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును , అందరిని మొలల మీద గోనెపట్ట కట్టుకొనజేయుదును , అందరి తలలు బోడిచేసెదను , ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును ; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును ; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు .
కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రము వరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొర కదు ;