ప్రధానియైన
సంఖ్యాకాండము 25:4

అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతులనందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.

సంఖ్యాకాండము 25:5

కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయోరుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.

2 దినవృత్తాంతములు 19:7

యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు,ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.

షిమ్యోనీయులలో
సంఖ్యాకాండము 1:23

షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమి్మదివేల మూడు వందలమందియైరి.

సంఖ్యాకాండము 26:14

ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.