
అతని తలమీద పాగాను పెట్టి, ఆ పాగామీదను అతని నొసట పరిశుద్ధకిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.
అది యెహోవాకు హోమము. మరియు మోషే దాని బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడించెను. ప్రతిష్ఠార్పణరూపమైన పొట్టేలులో అది మోషే వంతు. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడు దినములవరకు రేయింబగళ్లుండి, యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను; నాకు అట్టి ఆజ్ఞ కలిగెను.
యెహోవా మోషే కు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధస్థలములో అహరోను చేయు సేవనిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములుగల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి.
దానిమీదనున్న దాని విచిత్రమైన దట్టి యేకాండమై దానితో సమమైన పని గలిగి బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల పేనిన సన్ననారతోను చేయబడెను; అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లును అది ఏఫోదు నుండి విడిపోకుండునట్లును ఆ పతకమును దాని ఉంగరములకును ఏఫోదు ఉంగరములకును నీలి సూత్రముతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టు ఉంచిరి.
నీల ధూమ్ర రక్త వర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన నడికట్టును చేసిరి.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రమును కట్టిరి.
ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి.
మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి; ఆలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను.
నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,