
నిన్నును నైలునది చేప లన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు, అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను.
నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసెదను, ఆకాశ పక్షు లన్నియు నీమీద వ్రాలునట్లుచేసి నీవలన భూ జంతువు లన్నిటిని కడుపార తిననిచ్చెదను,
వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.