
మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,
బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
నేను ఊలయియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను. నేను కన్ను లెత్తి చూడగా, ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను; దానికి రెండు కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది.
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను, అది పట్టకుండ తప్పించుకొనుటకైనను, ఏ జంతువునకును శక్తిలేకపోయెను; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.
నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి, కాళ్లు నేల మోప కుండ భూమి యందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను.
ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి, భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.
నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని, మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను. ఆ పొట్టేలు దాని నెదిరింప లేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను.
ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలు దిక్కులకు నాలుగు పెరిగెను,
ఈ కొమ్ములలో ఒక దానిలోనుండి యొక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణము గాను తూర్పు గాను ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను.
ఆకాశ సైన్యము నంటునంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను
వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని యనుకొందురు; వాటిని అమి్మనవారు -మాకు బహు ద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు; వాటిని కాయువారు వాటి యెడల కనికరము చూపరు.
ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱలను కని పెట్టడు, చెదరిపోయినవాటిని వెద కడు, విరిగిపోయినదాని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాని కాపు కాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.
మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును.
యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచి–పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదిన మందు రావద్దని చెప్పెను.
అందుకు ప్రభువు–వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలు కొనిపోయి, నీళ్లు పెట్టును గదా.
ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింప దగదా? అని అతనితో చెప్పెను.