
యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా , ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధస్థలములారా , ఆర్భాటము చేయుడి పర్వతములారా , అరణ్యమా , అందులోని ప్రతి వృక్షమా , సంగీతనాదము చేయుడి.యెహోవా యాకోబును విమోచించును ఆయన ఇశ్రాయేలులో తన్నుతాను మహిమోన్నతునిగా కనుపరచుకొనును
యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి
సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై , ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి .
సంతోషించు వారితో సంతోషించుడి ;
కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.