
గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్రచేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబది మందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులోనున్న రాజ నగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.
అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు మీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.
అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కు పెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.
యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి—నీ యజమానుని చంపినవాడా, జిమీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
రాజైన ఆసాయేలుబడిలో మూడవ సంవత్సరమందు బయెషా అతని చంపి అతనికి మారుగా రాజాయెను.
తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి
అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభవించెను.
యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను -ఇతనికి యెజ్రెయేలని పేరుపెట్టుము. యెజ్రెయేలులో యెహూ యింటివారు కలుగజేసికొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇశ్రాయే లువారికి రాజ్యముండకుండ తీసివేతును.
ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును.