మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను.
సంఖ్యాకాండము 22:31

అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా

2 రాజులు 6:17-20
17

యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.

18

ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషాచేసిన ప్రార్థనచొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.

19

అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను.

20

వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థనచేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.

యెషయా 35:5

గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును

యెషయా 35:6

కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును

లూకా 24:16-31
16

అయితే వారాయనను గుర్తు పట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.

17

ఆయన–మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.

18

వారిలో క్లెయొపా అనువాడు–యెరూషలేములో బస చేయుచుండి, యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా? అని ఆయనను అడిగెను.

19

ఆయన– అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు–నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.

20

మన ప్రధానయాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి, సిలువవేయించిరో నీకు తెలియదా?

21

ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి; ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.

22

అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి

23

–కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.

24

మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.

25

అందుకాయన–అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా,

26

క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమ లో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి

27

మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటి లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.

28

ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యింక కొంతదూరము వెళ్లునట్లు అగపడగా

29

వారు–సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితో కూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.

30

ఆయన వారితో కూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచి పెట్టగా

31

వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.