సౌలు లేచి
1 సమూయేలు 23:23-25
23

మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కనిపెట్టియున్న సంగతి యంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును , అతడు దేశములో ఎక్కడనుండి నను యూదా వారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.

24

అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి . దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షిణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా

25

సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని , కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమబోయెను .

1 సమూయేలు 24:17

దావీదుతో ఇట్లనెను -యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు

కీర్తనల గ్రంథము 38:12

నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు.

కీర్తనల గ్రంథము 140:4-9
4

యెహోవా, భక్తిహీనుల చేతిలోపడకుండ నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు.

5

గర్విష్ఠులు నాకొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవప్రక్కను వల పరచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. (సెలా.)

6

అయినను నేను యెహోవాతో ఈలాగు మనవిచేయుచున్నాను యెహోవా, నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము.

7

ప్రభువైన యెహోవా నా రక్షణదుర్గము యుద్ధదినమున నీవు నా తలను కాయుదువు.

8

యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము. (సెలా.)

9

నన్ను చుట్టుకొనువారు తలయెత్తినయెడల వారి పెదవుల చేటు వారిని ముంచును గాక

మూడువేల
1 సమూయేలు 24:2

అప్పుడు సౌలు ఇశ్రాయేలీయు లందరిలోనుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను .