
సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను -బెన్యామీనీయులారా ఆలకించుడి . యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా ? మిమ్మును సహస్రా ధిపతులుగాను శతాధి పతులుగాను చేయునా ?
సౌలు -నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి , అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితి రేమని యడుగగా
సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు –మెఫీబోషెతూ అని అతని పిలిచినప్పుడు అతడు –చిత్తము, నీ దాసుడనైన నేనున్నాననెను.
నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.