
దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు .యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి . అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు , రెండవవాడు అబీనాదాబు , మూడవవాడు షమ్మా ,
దావీదు కనిష్ఠుడు ; పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి యుండిరిగాని
దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము –సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను –గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.
కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱల దొడ్డినుండి తీసికొని
తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను .
పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును , తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను .