ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలు తో -మనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము ; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను .
కాబట్టి యెహోవా మీకును మీ పితరు లకును చేసిన నీతికార్యము లనుబట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి
అందుకు రాజు నీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా