చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.
ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,
ఇశ్రాయేలీయుల గోత్రము లన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను .
బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను . తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను . అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడ లేదు .
కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదాగోత్రము పట్టుబడెను.
యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టుబడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను.
అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను.
అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.