చిత్తగించుము , నీవు వృద్ధుడవు , నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకల జనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము , అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి .
మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను .
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా -జనులు నీతో చెప్పిన మాట లన్నిటి ప్రకారము జరిగింపుము ; వారు నిన్ను విసర్జింప లేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు .
వారు నన్ను విసర్జించి , యితర దేవతలను పూజించి , నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచువచ్చిన కార్యము లన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు ; వారు చెప్పిన మాటలను అంగీకరించుము .
అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక -ఆలాగున కాదు ,
జనములు చేయురీతిని మేము ను చేయునట్లు మాకు రాజు కావలెను , మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి .
సమూయేలు జనులయొక్క మాట లన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను
గనుక యెహోవా -నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలు నకు సెలవియ్యగా సమూయేలు -మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను .
అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొని-యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను
అప్పుడు సమూయేలు -జను లందరిలో యెహోవా ఏర్పరచి నవానిని మీరు చూచితిరా ? జను లందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా , జను లందరు బొబ్బలు పెట్టుచు-రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి .
మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా
జను లందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి , యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయు లందరును అక్కడ బహుగా సంతోషించిరి .