అతనికి సౌలు అను నొక కుమారు డుండెను . అతడు బహు సౌందర్యముగల యౌవనుడు , ఇశ్రాయేలీ యులలో అతనిపాటి సుందరు డొకడును లేడు . అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటె ఎత్తు గలవాడు.
అయితే యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్య పెట్టకుము , మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు ; నేను అతని త్రోసివేసియున్నాను . మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును .
గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరు మూళ్ల జేనెడు ఎత్తుమనిషి .