రెండవ
ఆదికాండము 4:19

లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.

ఆదికాండము 4:23

లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని

ఆదికాండము 29:23-29
23

రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొనిపోగా యాకోబు ఆమెను కూడెను.

24

మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.

25

ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.

26

అందుకు లాబాను - పెద్ద దానికంటె ముందుగా చిన్నదాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.

27

ఈమెయొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసిన యెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా

28

యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరువాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.

29

మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.

న్యాయాధిపతులు 8:30

గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతని కుండిరి.

మత్తయి 19:8

ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.

గాని
ఆదికాండము 16:1

అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసియుండెను.

ఆదికాండము 16:2

కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.

ఆదికాండము 25:21

ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతిఆయెను.

ఆదికాండము 29:31

లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

న్యాయాధిపతులు 13:2

ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

లూకా 1:7

ఎలీసబెతు గొడ్రాలై నందున వారికి పిల్లలు లేకపోయిరి ; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి .)