నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే ; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు .
ఈరాత్రి యుండుము ; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి , అతడు విడిపింపవచ్చును . నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన యెడల , యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను ; ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను .
అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.
సహోదరులు కూడి నివసించుచుండగా వారిలోఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.
చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.
బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను;
బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయినయెడల, అతని సహోదరు డతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను.