ఆ బోయజు మనకు బంధువుడు
రూతు 2:20-23
20

నయోమి బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను . మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు , అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా

21

మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించు వరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పె ననెను .

22

అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారీ , అతని పనికత్తెలతో కూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను .

23

కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను .

ద్వితీయోపదేశకాండమ 25:5

సహోదరులు కూడి నివసించుచుండగా వారిలోఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.

ద్వితీయోపదేశకాండమ 25:6

చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.

హెబ్రీయులకు 2:11-14
11

పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక

12

నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను.

13

మరియు -నే నాయనను నమ్ముకొనియుందును అనియు -ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

14

కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,

ఎవని
రూతు 2:8

అప్పుడు బోయజు రూతు తో నా కుమారీ , నా మాట వినుము ; వేరొక పొలములో ఏరుకొనుటకు పో వద్దు , దీనిని విడిచి పో వద్దు , ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.

రూతు 2:23

కాబట్టి యవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను .