నీళ్లిమ్మని
న్యాయాధిపతులు 5:25

అతడు దాహమడిగెను ఆమె పాలు తెచ్చియిచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను ఆమె మేకును చేత పట్టుకొనెను

న్యాయాధిపతులు 5:26

పనివాని సుత్తెను కుడిచేత పట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను.

ఆదికాండము 24:43

నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పునప్పుడు

1 రాజులు 17:10

అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.

యెషయా 41:17

దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు , నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది , యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడ నాడను .

యోహాను 4:7

సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసునాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.