అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.
మరియు పది కొమ్ములును ఏడు తలలును గల యొక క్రూరమృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ములమీద పది కిరీటములును దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను.
పిమ్మట నాలుగవ రాజ్యమొకటి లేచును. అది ఇనుమువలె బలముగా ఉండును . ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగగొట్టునది గదా; ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగులగొట్టి పొడిచేయును .
పాదములును వ్రేళ్లును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదము లుండును . అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో ఆలాగుననుండును, ఆ రాజ్యము ఇనుమువంటి బలముగలదై యుండును .
పాదముల వ్రేళ్లు కొంతమట్టునకు ఇనుపవిగాను కొంతమట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును .
ఇనుమును బురదయు మిళితమై యుండుట తమరికి కనబడెను ; అటువలె మనుష్య జాతులు మిళితములై యినుము మట్టితో అతకనట్లు వారు ఒకరి తో ఒకరు పొస గక యుందురు .
పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా , ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువొకటి కనబడెను . అది తనకు ముందుగా నుండిన యితర జంతువులకు భిన్నమైనది ; అది మహాబల మహాత్త్యములు గలది; దానికి పెద్ద ఇనుప దంతములును పది కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలినదానిని కాళ్లక్రింద అణగద్రొక్కుచుండెను .
నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను ; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి . ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.
మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు,వాటి మధ్యనుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి , కన్నులును గర్వముగా మాటలాడు నోరునుగల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ములకంటె బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని.
ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును .
అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను.
ఇవి ఏమిటివని నేను నాతో మాటలాడుచున్న దూతనడుగగా అతడు-ఇవి యూదావారిని ఇశ్రాయేలువారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను.
యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా
వీరేమి చేయబోవుచున్నారని నేనడిగి నందుకు ఆయన-ఎవడును తలయెత్తకుండ యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును, యూదాదేశస్థులనందరిని చెదరగొట్టుటకై వారిమీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను.