
నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటిమధ్యను లేచెను ; దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి . ఈ కొమ్మునకు మానవుల కన్నులవంటి కన్నులును గర్వముగా మాటలాడు నోరును ఉండెను.
అప్పుడు నేను చూచుచుండగా , ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను ; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను .
ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును ; అతడు పండుగ కాలములను న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును ; వారు ఒక కాలము కాలములు అర్థ కాలము అతని వశమున నుంచబడుదురు .
ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు , ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధిపొందును ; అంతట నిర్ణయించినది జరుగును .
ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.
ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింబడును
మరియు పరిశుద్ధులతో యుద్ధముచేయను వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతి జనము మీదను అధికారము దానికియ్యబడెను.
వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములోనుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధముచేసి జయించి వారిని చంపును.