జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధి చేసికొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును.
జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధినొందును.
కాబట్టి మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగాఉన్నాను.