చూడుడి
నిర్గమకాండము 25:40

కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపముచొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.

2 రాజులు 16:10

రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి , దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి , దాని పోలికెను , మచ్చును , దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను .

యెహెజ్కేలు 43:10

కాబట్టి నర పుత్రుడా , ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము , వారు దాని వైఖరిని కనిపెట్టవలెను .

యెహెజ్కేలు 43:11

తాము చేసిన వాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడిన యెడల , మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమస్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాద లన్నిటిని విధు లన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచార విధు లన్నిటిని గైకొని ఆచరించునట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము .

హెబ్రీయులకు 8:5

మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు.