ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే
నిర్గమకాండము 1:19

అందుకు ఆ మంత్ర సానులుహెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లక మునుపేవారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.

2 సమూయేలు 16:18

హూషై యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.

2 సమూయేలు 16:19

మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.

2 సమూయేలు 17:19

ఆ యింటి యిల్లాలు ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చి బావిమీద పరచి దానిపైన గోధుమపిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి యెవరికిని తెలియకపోయెను.

2 సమూయేలు 17:20

అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమెవారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

2 రాజులు 6:19

అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు , ఇది పట్టణము కాదు , మీరు నా వెంట వచ్చినయెడల మీరు వెదకు వాని యొద్దకు మిమ్మును తీసికొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను .