అక్రబ్బీము
సంఖ్యాకాండము 34:4

మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రముయొక్క తూర్పు తీరమువరకు ఉండును. మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రబ్బీము కనమయొద్ద తిరిగి సీనువరకు వ్యాపించును. అది దక్షిణమునుండి కాదేషు బర్నేయవరకు వ్యాపించి, అక్కడనుండి హసరద్దారువరకు పోయి, అక్కడనుండి అస్మోనువరకు సాగును.

న్యాయాధిపతులు 1:36

అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.

సీను
ఆదికాండము 14:7

తిరిగి కాదేషను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్‌తామారులో కాపురమున్న అమోరీయులనుకూడ కొట్టిరి.

సంఖ్యాకాండము 20:1

మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.

సంఖ్యాకాండము 32:8

ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా