మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ వచ్చిరి.
నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పు నొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ,
నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము .
శీతకాలము రాక మునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము . యుబూలు , పుదే , లిను , క్లౌదియయు సహోదరు లందరును నీకు వందనములు చెప్పుచున్నారు.
అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు.
కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది; మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును.