మోషే ఆ గుడారము లోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషే తో మాటలాడుచుండెను .
ప్రజ లందరు ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి , లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి .
ఇశ్రాయేలీ యులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను . వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.