ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించినవాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?
మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.
అయితే విశ్వాస మూలమగు నీతి యీలాగు చెప్పుచున్నది -ఎవడు పరలోకము లోనికి ఎక్కిపోవును ? అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు;
లేక -ఎవడు అగాధము లోనికి దిగిపోవును ? అనగా క్రీస్తును మృతు లలోనుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయము లో అనుకొన వద్దు .