ఆ బంధువుడు నేను దానిని విడిపించు కొనలేను , నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో , నేను దాని విడిపింప లేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను .
మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును , చనిపోయినవాని పేరు అతని సహోదరులలో నుండియు , అతని స్థలముయొక్క ద్వారము నుండియు కొట్టివేయబడక యుండునట్లును , నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను . దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను .
అందుకు పురద్వారముననుండిన ప్రజ లందరును పెద్దలును మేము సాక్షులము , యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక ;
ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక ; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి .
కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను .
అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక ; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక .
నిన్ను ప్రేమించి యేడుగురు కుమారుల కంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను ; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకు డగునని నయోమితో చెప్పిరి .
అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను .
ఆమె పొరుగు స్త్రీలు నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి . అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి .
పెరెసు వంశావళి యేదనగా పెరెసు హెస్రోనును కనెను ,
హెస్రోను రామును కనెను , రాము అమ్మినాదాబును కనెను , అమ్మినాదాబు నయస్సోనును కనెను ,
నయస్సోను శల్మానును కనెను , శల్మాను బోయజును కనెను ,
బోయజు ఓబేదును కనెను , ఓబేదు యెష్షయిని కనెను ,
యెష్షయి దావీదును కనెను .
మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండివారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను.
సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు
ఆ దినమందు వారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.
వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్రాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.
ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహముచేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.
యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.