ఒకనికి వీర్యస్ఖలనమైనయెడల వాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.
ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతివానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతివానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.
ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
వెలుపలివారికి తీర్పుతీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పుతీర్చును గాని
మీరు లోపటివారికి తీర్పుతీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.