ఆదామునందు
1 కొరింథీయులకు 15:45-49
45

ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.

46

ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.

47

మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

48

మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టివారే.

49

మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము.

ఆదికాండము 2:17

అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

ఆదికాండము 3:6

స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునైయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;

ఆదికాండము 3:19

నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.

యోహాను 5:21-29
21

తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

22

తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని

23

తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

24

నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

25

మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

26

తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.

27

మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.

28

దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

29

మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.

రోమీయులకు 5:12-21
12

ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకము లో ఏలాగు ప్రవేశించెనో , ఆలాగుననే మనుష్యు లందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను .

13

ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకము లో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింప బడదు .

14

అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీద కూడ , ఆదాము మొదలుకొని మోషే వరకు మరణ మేలెను ; ఆదాము రాబోవు వానికి గురుతై యుండెను ,

15

అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు . ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయిన యెడల మరి యెక్కువగా దేవుని కృపయు , యేసు క్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును , అనేకు లకు విస్తరించెను .

16

మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు . ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.

17

మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసు క్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు .

18

కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన కృపాదానము మనుష్యు లకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.

19

ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో , ఆలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు .

20

మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను . అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో ,

21
ఆలాగే నిత్య జీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాప మెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను .