
వారెందుకు అందుకొన లేదు ? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి .
అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు ; కానియెడల కృప ఇకను కృప కాకపోవును .
ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి
దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి
మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి–ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు–మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.
సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.
మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను.
వారది తీసికొని–చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను,
పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానుని మీద సణుగుకొనిరి.
అందుకతడు వారిలో ఒకని చూచి–స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;
నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;
నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా అని చెప్పెను.
ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.