
రహస్యములు మన దేవుడైన యెహోవాకుచెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.
మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు దేవుడు నరుల శక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?
భూ నివాసు లందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ; ఆయన పరలోక సేనయెడలను భూ నివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు .