అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని,యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో ని
యేసు బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట నున్నప్పుడు,
ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను.
ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.
ఆ ఊరి లో ఉన్న పాపాత్మురాలైన యొక స్త్రీ , యేసు పరిసయ్యుని యింట భోజనమునకు కూర్చున్నాడని తెలిసికొని , యొక బుడ్డిలో అత్తరు తీసికొనివచ్చి
వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి , యేడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి , తన తల వెండ్రుకలతో తుడిచి , ఆయన పాదములను ముద్దుపెట్టుకొని , ఆ అత్తరు వాటికి పూసెను .