
ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి--ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
ఆ స్త్రీ ఏలీయాతో నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను.
ఎలీషా ఆ యింట జొచ్చి , బాలుడు మరణమైయుండి తన మంచము మీద పెట్టబడి యుండుట చూచి
తానే లోపలికిపోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి , యెహోవాకు ప్రార్థనచేసి
మంచముమీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి , బిడ్డమీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.
తాను దిగి యింటిలో ఇవతలనుండి యవతలకు ఒకసారి తిరిగి నడచి , మరల మంచముమీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడు మారులు తుమ్మి కండ్లు తెరచెను .
అప్పుడతడు గేహజీని పిలిచి ఆ షూనేమీయురాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను . ఆమె అతనియొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తికొనుమని ఆమెతో చెప్పెను .
అంతట ఆమె లోపలికివచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తికొని పోయెను .
కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.