ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు , కైసరునకు పన్ని య్య వద్దనియు , తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి .
అయితే వారు ఇతడు గలిలయదేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి .
ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీ మనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే . ఇదిగో నేను మీ యెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ లేదు ;
హేరోదునకు కూడ కనబడలేదు .హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగిన దేదియు ఇతడు చేయలేదు .
ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి , ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి ,
ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునైయున్నట్టు మేము కనుగొంటిమి,