ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభకూడి , ఆయనను తమ మహాసభ లోనికి తీసికొనిపోయి
ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల.. పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచనచేసి
ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి.
యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను
ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.
కాబట్టి పిలాతు నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు విన లేదా? అని ఆయనన అడిగెను.
అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
ఉదయము కాగానే ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసును బంధించి తీసికొనిపోయి పిలాతునకు అప్ప గించిరి.
పిలాతుయూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయననీవన్నట్టే అని అతనితో చెప్పెను.
ప్రధానయాజకులు ఆయనమీద అనేకమైన నేరములు మోపగా
పిలాతు ఆయనను చూచి మరలనీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను.
అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడెను.
వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.
కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.
పిలాతుమీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా
యేసు నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? అని అడిగెను.
అందుకు పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా
యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.
అందుకు పిలాతు నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసం
అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;