ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని అయనతో చెప్పగా
అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారి కందరికిని భయము కలిగెను . ఆ సంగతులన్నియు యూదయ కొండసీమల యందంతట ప్రచుర మాయెను .
ప్రభువు హస్తము అతనికి తోడై యుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సు లో ఉంచుకొనిరి .
ఇదిగో, నేనును, యెహోవా నాకిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.