ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొనివచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.
ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు . వారు-నీవు వెదక బోయిన గార్దభములు దొరికినవి , నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడు చున్నాడని చెప్పుదురు .
తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానము నకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు ; ఒకడు మూడు మేకపిల్లలను , ఒకడు మూడు రొట్టెలను , ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.
వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు . అవి వారిచేత నీవు తీసికొనవలెను .
ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు , అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే , స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగి వచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును , వారు ప్రకటనచేయుచు వత్తురు;
యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును ; నీవు వారితో కలిసి ప్రకటన చేయు చుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును .
దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము .
నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.
మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను?
లేతమొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయనయెదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి, అపేక్షించునట్లుగా అతనియందు సురూపము లేదు.