Get
నెహెమ్యా 6:9-11
9

నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము.

10

అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా

11

నేను నావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.

కీర్తనల గ్రంథము 11:1

యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల?

కీర్తనల గ్రంథము 11:2

దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు

ఆమోసు 7:12
మరియు అమజ్యా ఆమోసు తో ఇట్లనెను -దీర్ఘదర్శీ , తప్పించుకొని యూదా దేశము నకు పారి పొమ్ము ; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము ;
ఆమోసు 7:13
బేతేలు , రాజు యొక్క ప్రతిష్ఠితస్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయ కూడదు .